telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతడంటే అందుకే చాలా ఇష్టం…

Priyanka

నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా ఈ జోడీ తెలియని వారుండరు. ప్రపంచమంతా ఫేమస్ అయిన వీరు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ దంపతులు తమ రెండో ఆనివర్సరీని జరుపుకున్నారు. గత ఏడాది ఈ సమయానికి తమ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రపంచ సుందరి కొన్ని రహస్యాలను పంచుకుంది. నిక్ సూపర్ స్వీట్‌ అని పొగుడుతూనే అతడికి ఓ వింత అలవాటు ఉందని చెప్పింది. నేను నిద్రలేచిన తరువాత నా ముఖం చూడటానికి నిక్ చాలా ఇష్టపడతాడు. అది నాకూ నచ్చుతుంది. కానీ నిక్ నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా ముఖం చూస్తుండాలని ఆశపడుతాడు. నేనోమో ముఖానికి మాయిశ్చర్ చేసుకున్నాక చూడాలనుకుంటాను. నిద్రమత్తులో ఉన్న నా ముఖం చూడటం నిక్‌కు చాలా ఇష్టం. అందుకే నిక్ అంటూ నాకు చాలా ఇష్టమని ప్రియాంకా చెప్పింది. భర్త నుంచి భార్య కోరుకునేది ఇదే అని ఇదేమా జోక్ కాదంటూ చెప్పింది. ఇదిలా ఉంటే ప్రయాంకా వివాహం అయిన తరువాత కూడా తన నటనా జీవితాన్ని కొనసాగిస్తోంది. ప్రియాంకా నూతనంగా ‘టెక్ట్స్ ఫర్ యు’ అనే సినిమా చిత్రీకరణ నిమిత్తం యూకెలో ఉంది. ఈ సినిమా ఇటీవల మొదలయిది. దీని తరువాత ప్రపంచ సుందని ‘వి కెన్ బీ హీరోస్’ పిల్లలు ఇష్టపడే కథతో రానుంది. ఇందులో ప్రియాంకా విలన్‌గా కనిపించనుంది.

 

Related posts