telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏపీలో పెరగనున్న వడగాడ్పులు

this summer exceeds 47 degress and more

భానుడి ఉగ్రరూపానికి ఎండవేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు ఆర్టీజీఎస్ అధికారులు హడలెత్తించే విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వడగాడ్పుల తీవ్రత పెరగనుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) వెల్లడించింది. ఈనెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. వడగాడ్పుల ప్రభావం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలు, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts