telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆ లైసెన్సు ఉంటె.. తెలంగాణాలో లైసెన్స్ వచ్చినట్టే..

telangana govt sanctioned license on

తెలంగాణ రవాణాశాఖ విదేశాల నుంచి వచ్చే భారతీయులకు ఎలాంటి డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు జరుపకుండానే లైసెన్స్ ఇస్తున్నది. ఈ విషయం తెలియని చాలామంది లర్నింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకొని మరీ లైసెన్సు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం లేదా పారిశ్రామికవేత్తలుగా విదేశాల్లో స్థిరపడినవారు ఆయా దేశాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉంటే స్వదేశంలో మళ్ళీ డ్రైవింగ్ పరీక్షకు హాజరుకావ్వాల్సిన అవసరం లేదు.

వీసా, పాస్‌పోర్టుతోపాటు స్థానిక చిరునామా ఆధారాలు (ఆధార్ కార్డు, మున్సిపల్ ట్యాక్స్ బిల్లు, ఇక్కడి అడ్రస్‌తో ఉన్న ఇన్సూరెన్స్) స్థానిక ప్రాంతీయ రవాణాశాఖ అధికారికి సమర్పిస్తే కొత్త లైసెన్సు జారీచేస్తారు. విదేశాలకు సంబంధించిన లైసెన్సు అసలుదా? నకిలీదా? అనే అంశాన్ని నిర్ధారించుకొన్న తర్వాతనే ఇక్కడి లైసెన్సు జారీచేస్తారు. అమెరికాకు చెందిన లైసెన్సుల ఒరిజినాలిటీ నిర్ధారించుకోవడం సులువని, ఇతర దేశాల్లో మాత్రం ఇబ్బందవుతున్నదని రవాణాశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Related posts