telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక: శరద్ పవార్ కూతురు

supriya sule mp

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె తన వాట్సాప్ స్టేటస్ లో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు.

‘పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక వచ్చింది’ అని అన్నారు. ఈ వాట్సాప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలపై చర్చించడానికి తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు.

Related posts