telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అమాయకత్వానికి పరాకాష్ట.. బిర్యానీ కోసం 40వేలు .. దేవుడా.. !

Hyderabad Wisdom Jobs Portal Cheat youth

బిర్యానీ అంటే యెంత ఇష్టం, పిచ్చి ఉంటేమాత్రం ఇంతలాగానా.. ఇది అమాయకత్వమా.. ఇంకేమైనా .. 76కే బిర్యానీ అని ఆశ చూపి ఏకంగా రూ.40 వేలు కొట్టేశారు కేటుగాళ్లు. చెన్నైలో జరిగిందీ ఘటనలో నగరానికి చెందిన విద్యార్థిని ప్రియ మొబైల్ ఫోన్‌కు రూ.76కే బిర్యానీ అంటూ ఓ ఫుడ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అది చూసిన వెంటనే ఆమె ఆర్డర్ చేసింది. అయితే, గంటలు గడుస్తున్నా బిర్యానీ రాకపోవడంతో ఫోన్ చేసి కనుక్కుంది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరింది. రూ.76ను ఆన్‌లైన్‌లో వెనక్కి పంపడం సాధ్యం కాదని, మరో రూ.5 వేలు జమచేస్తే మొత్తం రూ.5,076లు పంపిస్తామని చెప్పడంతో నిజమేనని నమ్మిన ప్రియ వారు అడిగిన మొత్తాన్ని పంపింది.

అయినప్పటికీ డబ్బులు వెనక్కి రాకపోవడంతో మరోమారు ఫోన్ చేసింది. ఆ మొత్తం కూడా పంపడం సాధ్యం కావడం లేదని, కాబట్టి మరికొంత సొమ్ము పంపాలని యాప్ నిర్వాహకులు కోరారు. వారి మాటలు నిజమని నమ్మిన ప్రియ అలా మొత్తం రూ.40 వేలు సమర్పించుకుంది. ఆ తర్వాత కూడా వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts