telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాజీ లవర్ తో రష్మిక చాటింగ్…

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే సిద్ధార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. తెలుగుఓ పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది రష్మిక.  ఇది ఇలా ఉంటే.. నిన్న ఈ భామ పుట్టిన రోజు. అయితే… ఆమె బర్త్‌ డే సందర్భంగా మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. “నీ కిరిక్‌ పార్టీ ఆడిషన్‌కు సంబంధించిన ఓ అందమైన అనుభవాన్ని షేర్‌ చేస్తున్నాను. అప్పటి నుంచి నువ్వు ఎంతో దూరం ప్రయాణించావు. నీకలలు సాకారం చేసుకునేందుకు ఓ యోధురాలిగా పోరాడుతున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌ డే టూ యూ అంటూ రక్షిత్‌ విషెస్‌ తెలిపాడు. “ఇక రక్షిత్‌ ట్వీట్‌పై రష్మిక మందన్న కూడా రెస్పాండ్‌ అయింది. “అవును ఇది నాకు చాలా గుర్తుంది. రక్షిత్‌ కృతజ్ఞతలు..” అంటూ రష్మిక తెలిపింది.

 

Related posts