telugu navyamedia
andhra culture news Telangana

37 రైళ్లు పూర్తిగా… 33 రైళ్లు పాక్షికంగా రద్దు!

special train between vijayawada to gudur

ఈ నెల 8, 9, 10వ తేదీల్లో భారీగా రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముద్కేడ్‌-పర్బని సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్నందున ఈ నెల 8వ తేదీన కొన్ని, 9,10వ తేదీల్లో మరికొన్ని రైళ్లు ఐదు నుంచి ఏడు రోజులపాటు రద్దుకానున్నట్లు తెలిపారు. 37 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తుండగా, మరో 33 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

మేడ్చల్‌-హెచ్‌ఎస్‌, నాందేడ్‌-మేడ్చల్‌, ఆదిలాబాద్‌-పూర్ణ-ఆదిలాబాద్‌, నిజామాబాద్‌-పంధర్‌పూర్‌-నిజామాబాద్‌, తిరుపతి-అమరావతి-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి-ఆదిలాబాద్‌ మధ్య తిరిగే రైళ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Related posts

లోటస్‌పాండ్‌ వద్ద వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

vimala p

డీకే అరుణకు .. తెలంగాణ బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం..

vimala p

డాక్టర్ సోమ్లా అరెస్ట్ పై ఘాటుగా స్పందించిన గల్లా!

vimala p