telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు: మంత్రి హరీష్‌

harish rao trs

సిద్దిపేట మార్కెట్‌యార్డులో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో 169 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం 32 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

వరిని రూ. 1835, పత్తిని రూ. 5550 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయి. ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్‌ రూ. 7 వేల కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు.

Related posts