telugu navyamedia
సినిమా వార్తలు

డియర్ ట్రోలర్స్ మరిన్ని మీమ్స్ చేయండి… : సోనాక్షి సిన్హా

Sonakshi-Sinha

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి శుక్రవారం నాడు తల్లి పూనమ్ సిన్హాతోపాటు గెస్ట్ గా వచ్చారు సోనాక్షి. సోనాక్షి కో పార్టిసిపెంట్‌గా రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త రూమా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి గేమ్ ఆడారు. తొలి రౌండ్ లోనే ప్రశ్నలన్నింటికీ లైఫ్ లైన్లు వాడిన వీరిద్దరికీ రామాయణానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. “రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?” అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్ గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. రామాయణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా సమాధానం ‘లక్ష్మణుడు’ అని కరెక్ట్ గా చెప్పేవారు. కానీ సోనాక్షికి రామాయణం గురించి తెలియక దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకున్నారు. లైఫ్ లైన్ తీసుకునే ముందు ‘సీత’ అయి ఉంటుందని గెస్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ఏకిపారేస్తున్నారు. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా. ఆయ‌న తన ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు సీతారాముల కుమారులైన లవకుశల పేర్లు పెట్టుకున్నారు. మ‌రి రాముడిని అంతగా కొలిచేవారి కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో నెటిజ‌న్స్ ఓ ఆట ఆడుకున్నారు. “sonakshi so dumb” పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ప్రారంభించి ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా స్పందించిన సోనాక్షి “డియ‌ర్ ట్రోల‌ర్స్‌.. నాకు పైథాగ‌ర‌స్ సిద్ధాంతం, మ‌ర్చెంట్ ఆఫ్ వెనిస్‌, ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌, మొఘ‌ల్ వంశ చ‌రిత్ర కూడా తెలియ‌దు. కాబ‌ట్టి ఖాళీగా ఉన్న నెటిజ‌న్స్ .. వీటిపైన కూడా మీమ్స్ చేయండి. నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం” అంటూ త‌న‌దైన శైలిలో స్పందించింది.

Related posts