telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-4 వ్యాఖ్యాత ఎవరంటే ?

star maa promo on bigg boss 3

తెలుగు, తమిళ, హిందీ… ఇలా ప‌లు ప్రాంతీయ భాష‌లలో బిగ్ బాస్ రియాలిటీ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న విషయం తెలిసిందే. తెలుగులో నాగార్జున హోస్ట్ గా తొమ్మిదవ వారం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్-3. ఈరోజు పదవ వారం నామినేషన్లు జరగనున్నాయి. ఇక త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా సీజ‌న్ 3 జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో, నాలుగో సీజ‌న్‌కి హోస్ట్ ఎవ‌రు అనే దానిపై విప‌రీత‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మొద‌టి మూడు సీజ‌న్స్ కి హోస్ట్‌గా ఉన్న క‌మ‌ల్ హాస‌న్‌, నాలుగో సీజ‌న్‌ని హోస్ట్ చేయ‌డ‌ని, ఆయ‌న స్థానంలో శింబు రీప్లేస్ అవుతార‌ని అనేక పుకార్లు షికారు చేశాయి. ఈ వార్త‌లపై స్పందించిన బిగ్ బాస్ యాజ‌మాన్యం క‌మ‌ల్ నాలుగు సీజ‌న్స్‌కి హోస్ట్‌గా ఉంటాన‌ని ముందే అగ్రిమెంట్ చేశారు. శింబు హోస్ట్ చేస్తాడ‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అంటూ నిర్వాహ‌కులు క్లారిటీ ఇచ్చారు. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌స్తుతం శంకర్ దర్శకత్వంలో “ఇండియ‌న్-2” సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

Related posts