telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యాషన్ డిజైనర్ తో తెలుగమ్మాయి డేటింగ్ ?

Sobhita-Dhulipalla

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల తెలుగులో “గూఢచారి” సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల “మేడ్ ఇన్ హెవెన్” అనే వెబ్ సిరీస్ లో నటించి తన అందాల ప్రదర్శనతో షాకిచ్చింది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు బాలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. కొంతకాలం క్రితం ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రణవ్ మిశ్రాను కలిసిన శోభిత అతడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందట. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియాలో ఈ జంట డేటింగ్ చేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ “మూతోన్” అనే సినిమాలో నటిస్తోంది. మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా శోభితా “సేక్రేడ్ గేమ్స్ సీజన్-2” అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది.

Related posts