telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కామెన్వెల్త్ క్రీడల్లో .. షూటింగ్‌ విభాగం రచ్చ.. బహిష్కరిస్తామంటున్న భారత్ …

shooter on common wealth games

ఇండియన్ షూటర్ హీనా సిద్ధు భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తీసుకున్న నిర్ణయానికి మద్ధతుగా నిలిచారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇతర క్రీడలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామెన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్‌ను తప్పించడం కుదరదని ఐఓఏ తెగేసి చెప్పింది. ఒకవేళ తప్పించాలని చూస్తే తాము ఆ మెగా ఈవెంట్‌కు దూరం అవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ను చేర్చకపోతే టోర్నీ మొత్తాన్ని బహిష్కరించే అంశాన్ని పరిశీలించాలంటూ ఐఓఏ అధ్యక్షుడు నరేందర్ బాత్రా.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ ద్వారా తెలిపారు.

‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్‌ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్‌ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు. జూన్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో 3 కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్‌ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్‌) ప్రతిపాదన తెచ్చింది. ఒకవేళ అలా చేస్తే.. పతకాల పరంగా భారత్‌కు చాలా నష్టం జరుగుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్‌లో వచ్చినవే.

Related posts