telugu navyamedia
సినిమా వార్తలు

‘శాకుంతలం’సెట్‌‌‌‌లో బ‌న్నీ సంద‌డి…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన తనయ అల్లు అర్హకు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది . తన అల్లరితో ముద్దుముద్దు మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అర్హ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం అర్హను ఎంపిక చేశారు. ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన సెట్‌‌‌‌లోనే కాసేపు గడిపి కూతురి అల్లు అర్హ పాల్గొనే సన్నివేశాల షూటింగ్‌‌‌‌‌ని గమనించారు.

బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుడి అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోందుతున్న‌ ఈ సినిమాలో బేబీ అల్లు అర్హ భరతుడుగా అలరించనుంది.

కాగా ..‘శాకుంతలం’  సెట్‌‌‌‌లో బన్నీ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు వారి నాలుగో తరం వారసురాలు అర్హకి డెబ్యూ మూవీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నారు.

Related posts