telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: కేటీఆర్

హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. వారం రోజుల పాటు ఇది కొనసాగనుంది. అనంతరం చేనేత కళాకారులతో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణలోని నేతన్నలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. అందరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సంస్కృతి కి వైభవాన్ని తెచ్చారని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కామర్స్ ద్వారా ఈ గోల్కొండ అనే వెబ్ సైట్ అనే పోర్టల్ ను ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం

కల్పిస్తున్నట్లు తెలిపారు. చేనేతకు చేయూత కింద రూ. 30 కోట్ల చెక్కును అందించారు. నేతన్నల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకే ప్రతి ఏటా ప్రభుత్వం చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2014 కు ముందు అప్పటి ప్రభుత్వంలో చేనేతలకు బడ్జెట్ కేటాయింపులు 70 కోట్లు మాత్రమే చేశారని, తెలంగాణ వచ్చాక 1200 కోట్లు కేటాయించామని అన్నారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం రాయితీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

Related posts