telugu navyamedia
సినిమా వార్తలు

“దొరసాని” ప్రీ లుక్

Dorasani

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “దొర‌సాని”. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్నారు. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల చేశారు చిత్రబృందం. ఈ ప్రీ లుక్ లో క‌విత రాసి ఉన్న పేప‌ర్‌పై ప్ర‌ధాన పాత్ర‌ధారుల చేతుల‌ని చూపించారు. ఈ ప్రీ లుక్ చూసిన ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. మే 30న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్రకటించారు చిత్రబృందం.

Related posts