telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటితో నటుడి ఎఫైర్… సల్మాన్ ఫైర్… సూట్ విప్పి నేలకేసి కొట్టి…!?

Salman-Khan

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13లో అర్హాన్ ఖాన్, రష్మి దేశాయ్ అనే ఇద్దరు బుల్లితెర నటులు పాల్గొన్నారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అర్హాన్ ఎలిమినేట్ అయినప్పుడు రష్మి తెగ ఏడ్చేసింది. బిగ్ బాస్‌కి కావాల్సింది ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలే కాబట్టి అర్హాన్‌ను మళ్లీ షోలోకి తీసుకొచ్చాడు సల్మాన్. దాంతో రష్మి, అర్హాన్ మరింత క్లోజ్ అయిపోయారు. అయితే బిగ్‌బాస్ షోలోనే రష్మిని పెళ్లి చేసుకుంటానని అర్హాన్ వెల్లడించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి రిలేషన్‌షిప్‌లో బాంబ్ పేల్చాడు సల్మాన్. స్టేజ్‌పైకి కోపంగా వచ్చిన సల్మాన్.. అర్హాన్‌కు సూటి ప్రశ్న వేశాడు. ‘అర్హాన్ నీకు బయటి ప్రపంచం గురించి మాట్లాడటమంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు నీ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’ అని అడిగాడు. ఇందుకు అర్హాన్ తెగ కంగారుపడిపోతూ… ‘నేను, అమ్మానాన్న, చెల్లి’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు సల్మాన్.. ‘ఇంకెవరు ఉంటారు’ అని కోపంగా అడిగాడు. ఇందుకు అర్హాన్ గుటకలు మింగాడు. దాంతో సల్మాన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. తన సూట్ విప్పి నేలకేసి కొట్టాడు. ‘నీ భార్య, బిడ్డ గురించి రష్మికి చెప్పలేదా?’ అని అందరి ముందు నిలదీశాడు. దాంతో బిగ్‌బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్లు షాకయ్యారు. ఈ విషయం తెలీగానే రష్మి గుండె పగిలిపోయింది. కన్నీరుపెట్టుకుంది. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts