telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

అయ్యప్ప దర్శనానికి మళ్ళీ వెళ్తాము.. అనుమతి ఇవ్వమని కోర్టును కోరిన.. దుర్గా, బిందులు..

Sri Lankan Woman Enter Sabarimala Temple

దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం అల్లాడిపోతుంటే, కొంతమంది కొత్తకొత్త సమస్యలు సృష్టించేందుకే పుట్టినట్టుగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతూనే ఉంటారు. ఈ కోవకు చెందినట్టుగా మరోసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతి కోసం పిటీషన్ వేశారు బిందు, కనకదుర్గలు. వారి దర్శనం సజావుగా అవడానికి, అనంతరం రక్షణ కల్పించాలని కూడా ఆ పిటిషన్ లో కోరడం విశేషం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఇటీవల ఆ ఇద్దరు మహిళలు గత నెల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బిందు, కనకదుర్గలకు 24/7 రక్షణ కల్పించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 2వ తేదీన బిందు, కనకదుర్గలు ఆలయంలోకి వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఆలయంలోకి వెళ్లిన అనంతరం వారిద్దరూ కొన్ని రోజుల పాటు అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకున్నారు. జనవరి 15న కనకదుర్గ తన ఇంటికి వెళ్లగా.. ఆమె అత్త కనకదుర్గపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బిందు, కనకదుర్గలు తమకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related posts