telugu navyamedia
సినిమా వార్తలు

కాబోయే భర్తతో బాలిలో రేణూదేశాయ్

Renu-Desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా తన పిల్లలు అకీరా, ఆద్య, తనకు కాబోయే భర్తతో కలిసి సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండోనేషియాలోని బాలిలో సరదాగా గడుపుతున్నారు. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది రేణురేశాయ్. ఆద్యతో కలిసి తనకు కాబోయే భర్త డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసుకున్నారు. అయితే ఇంతవరకూ తనకు కాబోయే భర్త వివరాలనుగానీ, ముఖాన్ని గానీ పరిచయం చేయలేదు రేణు. ఈ విషయంపై గతంలోనే స్పందించిన రేణు తనకు కాబోయే భర్త విషయంలో తన పిల్లలు హ్యాపీగా ఉన్నారని, ఆయనకు సంబంధించిన ఎలాంటి వివరాలనూ బయటకు చెప్పనని స్పష్టం చేసింది రేణూదేశాయ్. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Related posts