telugu navyamedia
సినిమా వార్తలు

తప్పుగా అనుకోకండి… ఆధారాలు కావాలి : రష్మిక

Rashmika Mandanna images
“ఛలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ రష్మిక మందన్న. “గీత గోవిందం”, “దేవదాస్‌” చిత్రాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన “డియర్‌ కామ్రేడ్‌”లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న “భీష్మ” చిత్రంలో, మరోపక్క  “యజమాన”, “పొగరు” అనే కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ మధ్య రష్మిక వరుసగా తెలుగు సినిమాలనే చేస్తున్నారని, కన్నడ చిత్రాలకు సైన్ చేయడం లేదని, “రష్మిక విషయంలో అప్సెట్ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ” అనే శీర్షికతో ఓ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయం రష్మిక వరకు వెళ్లడంతో… ఆమె ఆ వెబ్ సైట్ ను తన సొంత పరిశ్రమ తనపై కోపంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు.
“ఇలా ఎవరన్నారు ? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి… కానీ తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. సాధారణంగా నేను ఇలాంటివి పట్టించుకోను. నాకు మీరు నేరుగా మెసేజ్ చేయండి. ఎందుకంటే నా చిత్ర పరిశ్రమ గురించి మీరు ఇలా రాయడం, వారు నాపై కోపంగా ఉన్నారని చెప్పడంలో అర్థం లేదు. నేను ఇలాంటివి నమ్మను. నాకు ఆధారాలు కావాలి… ఇవ్వండి… ” అంటూ కొంటెగా నవ్వుతున్న ఎమోజీని రష్మిక ట్వీట్ చేశారు.

Related posts