telugu navyamedia
సినిమా వార్తలు

“బాటిల్ క్యాప్ ఛాలెంజ్” పై రష్మీ ఫైర్

rashmi goutam movie sivaranjani trailer

ప్రస్తుతం సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యానంటూ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ప్రముఖులతో పాటు యూత్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ఈ ఛాలెంజ్ పై యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ” బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని నిజంగానే సీరియస్ గా తీసుకుంటున్నారా..? అసలు ఇలాంటివి చేసేవాళ్లకు పనీపాటా లేదు. ఇలాంటి వాటిపై శ్రద్ధ పెట్టేకంటే పనికొచ్చే విషయాలపై పెడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని.. అలాంటి వాళ్లు సెలబ్రిటీలు చేసే మంచి పనులకు కూడా చూడాలి. అభిమానులు అని చెప్పుకుంటున్న వారు సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదు” అంటూ ఫైర్ అయ్యింది రష్మీ.

Related posts