telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దర్బార్” దర్శకుడిపై నయన్ గరం గరం…?

Nayanathara

నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఆమె ఇది వరకు చేసిన ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో ఆమె నటనకు ముగ్ధులైపోయారు. సింహ సినిమాలో ఆమె నటనకు జేజేలు కొట్టాల్సిందే. వాస్తవానికి ఏదైనా సినిమాలో నయనతార ఉందంటే.. కచ్చితంగా ఆమె హైలైట్ అవుతుంది. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించుకుంది నయనతార. అయితే తాజాగా నయన్ నటించిన భారీ చిత్రాలు ఆమెకు కనీస గుర్తింపును కూడా తీసుకురాలేకపోయాయి. మెగాస్టార్ చిరంజీవి `సైరా`, తమిళ స్టార్ హీరో విజయ్ `విజిల్` చిత్రాల్లో నయన్ నటించింది. ఈ రెండు చిత్రాల్లోనూ నయన్ కనీస ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించి అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం నటిస్తున్న రజినీ `దర్బార్` చిత్రంలోనూ నయన్‌ది అలాంటి పాత్రేనట. ఈ నేపథ్యంలో `దర్బార్` దర్శకుడు మురుగదాస్‌పై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. కెరీర్ ఆరంభంలో నయన్.. మురుగదాస్ రూపొందించిన `గజినీ` చిత్రంలో నటించింది. జీవితంలో తను చేసిన అతి పెద్ద తప్పు `గజనీ` చిత్రంలో నటించడం అని, కథ చెప్పినప్పుడు తన పాత్ర వేరే విధంగా ఉందని, సినిమాలో మాత్రం పూర్తి డమ్మీగా చూపించారని గతంలో నయన్ వ్యాఖ్యానించింది. ఆ సినిమా తర్వాత మురుగదాస్ సినిమాలో నయన్ నటించలేదు. చాలా ఏళ్ల తర్వాత `దర్బార్` కోసం మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని నయన్ ఆవేదన వ్యక్తం చేసిందట. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా చిత్రయూనిట్‌పై నయన్ ఆగ్రహంగా ఉందట.

Related posts