telugu navyamedia
సినిమా వార్తలు

పదవ తరగతి ఫెయిల్ అయ్యా… : రానా

Rana

దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రానా… “బాహుబలి” చిత్రంతో అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. భల్లాల దేవుడుగా భారీ క్రేజ్ వచ్చింది రానాకు. ప్రస్తుతం రానా తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటిస్తున్నారు. ఇంతగా పాపులర్ అయిన రానా పదవ తరగతి ఫెయిల్ అయ్యారట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

“నేను చదువులో చాలా వీక్… అయితే నా చదువు గురించి ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆందోళన పడలేదు. అప్పటికే నాకు సినిమాలంటే ఇష్టమని వాళ్లకు తెలుసు. తాతగారు కూడా నాకు ఆసక్తి ఉన్న రంగంలో ఉండనిస్తేనే మంచిదని అన్నారు. ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. పదవ తరగతి ఫెయిల్ అయిన నాకు పాస్ కావడానికి చాలా సమయమే పట్టింది. పది పాస్ కావడం కోసంస్కూల్ మారిన సమయంలోనే రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడిగా మారాడు. అల్లు అర్జున్ కూడా నాకు మంచి స్నేహితుడు. వాళ్లిద్దరూ త్వరగా పెళ్ళి చేసుకున్నారు. అందుకే వాళ్ళను అప్పట్లో బాగా ఏడిపించాను. ఇప్పుడు బన్నీ నేను ఎక్కడ కన్పించినా “పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నవురా ?” అంటూ ప్రశ్నిస్తాడు. పెళ్ళైతే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఎప్పుడో తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు ఈ 34 ఏళ్ల యంగ్ హీరో.

Related posts