telugu navyamedia
సినిమా వార్తలు

వర్మ చేతిలో మరో వివాదాస్పద ప్రాజెక్ట్

Ram Gopal Varma,Sasikala

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలవ్వకముందు ప్రమోషన్స్ లో భాగంగా తన తరువాత చిత్రం వైఎస్సార్ జీవితం ఆధారంగా “రెడ్డిగారు పోయారు” అనే టైటిల్ తో రూపొందబోతోందని తెలిపారు. కానీ ఇప్పుడు అందరికీ షాకిస్తూ మరో వివాదాస్పద ప్రాజెక్టును చేయబోతున్నట్లు ప్రకటించారు వర్మ.

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ జీవిత కథతో “శశికళ” అనే టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు వర్మ. ఈ టైటిల్ కు “లవ్ ఇన్ డేంజరస్లీ పొలిటికల్” అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జయలలిత, శశికళ మధ్య ఉన్న అనుబంధం చూపెడతారని భావిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరి వర్మ సినిమాలో ఏం చూపించబోతున్నాడు ? శశికళగా ఎవరు నటిస్తున్నారు ? జయలలితగా ఎవరు కనిపించబోతున్నారు ? అనే ఆసక్తి మొదలైంది అందరిలో. త్వరలోనే వర్మ ఈ సందేహాలకు బదులుగా నటీనటుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది.

Related posts