telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. అమ్మాయిలకు .. రాగిలడ్డు పథకం..

ragi laddu for girls in lunch by telangana

తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే బాలికలకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా రాగి లడ్డూలు అందించనుంది. మధ్యాహ్న భోజనంలో భాగంగా వీటిని ఇవ్వనున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో మిగిలిన మూడు రోజులు 6, 7, 8 తరగతుల బాలికలకు రాగి లడ్డూలు ఇవ్వనున్నారు. వారానికి 3 రోజుల చొప్పున 13 వారాలు అందిస్తారు. మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ)లో విద్యాశాఖ ప్రతిపాదించగా.. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 3,53,565 మంది ప్రయోజనం పొందుతారు. దీనికి ఏడాదికి రూ.8.06 కోట్లు వ్యయం కానుంది. అందులో 60 శాతం.. అంటే రూ.4.84 కోట్లను కేంద్రం అందిస్తుంది. మిగిలిన రూ.3.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

పాఠశాలల ఖాళీ స్థలాల్లో పెరటి తోటల ద్వారా వివిధ కూరగాయలు, పండ్ల తోటలను పెంచాలన్నది విద్యాశాఖ ఆలోచన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1328 బడుల్లోని పెరటి తోటల్లో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. వాటిని మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. ఇదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 13,694 పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్లను రూపొందించుకుంటామని విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ఒక్కోదానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.6.66 కోట్లు ఖర్చవుతుంది. దీన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను భరిస్తాయి.

Related posts