telugu navyamedia
సినిమా వార్తలు

చిన్మయి చెప్పింది నిజమే… నేనే అసభ్యంగా… : సింగర్ రఘు దీక్షిత్

Raghu

కన్నడ సింగర్ రఘు దీక్షిత్ తన భార్య, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గాయని చిన్మయి గతంలో రఘు దీక్షిత్ పై మీటూ ఆరోపణలు చేసింది. ఆ కారణంగానే రఘు కాపురంలో కలతలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన రఘు.. గాయని చిన్మయి తనపై చేసిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నాడు. చిన్మయి చెప్పినట్లుగానే ఓ మహిళా సింగర్ తో అసభ్యంగా ప్రవర్తించానని స్పష్టం చేశారు. ఓ పాటను రికార్డ్ చేస్తోన్న సమయంలో ఉద్వేగానికి లోనవ్వడంతో ఫిమేల్ సింగర్ ని గట్టిగా హత్తుకున్నానని, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. అయితే ఆ సమయంలో ఆమె తనను తోసేయడంతో వెంటనే క్షమాపణలు కూడా చెప్పినట్లు వెల్లడించాడు. ఇప్పుడు మరోసారి క్షమాపణలు బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. ఈ విషయం మయూరికి తెలిసిన కారణంగా తన భర్తతో ఉండలేక విడాకుల వరకు వెళ్లిందని టాక్.

Related posts