telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మీ నెలకొకరిని మార్చే టైపు… బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ వ్యాఖ్యలు

Siddharth

బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 13పై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ సీజన్ లో ఆడవాళ్లపై అసభ్యకరమైన కామెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా.. నటి రష్మీ దేశాయ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బిగ్‌బాస్ షో స్టార్ట్ అయిన కొత్తలో రష్మీ, సిద్ధార్థ్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత బద్ధ శత్రువుల్లా తయారయ్యారు. అసలు రష్మీతో ఎందుకు గొడవ వచ్చిందో సిద్ధార్థ్ వెల్లడిస్తూ ఆమె క్యారెక్టర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు. “రష్మీతో నేను ఎందుకు గొడవపడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. నేను ఇప్పుడే దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను రష్మీని చాలా ఇష్టపడ్డ మాట నిజమే. కానీ నేను సెట్స్‌లో ఇతర నటీనటులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడినని నా గురించి కొన్ని పత్రికలు రాసాయి. అవన్నీ రష్మీకి ఉన్న సమస్యలు. రష్మీనే ఈ సమస్యలన్నింటికీ కారణం అని నాకు ప్రొడక్షన్ బాయ్స్ చెప్పారు. అదీకాకుండా రష్మీ నెలకొకరిని మార్చే టైపు” అన్నాడు. దాంతో రష్మీకి కోపం వచ్చి సమయం వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి బయటపెడతానని హెచ్చరించింది. దాంతో నెటిజన్లు ఆయన ప్రవర్తనపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై సల్మాన్ పై కూడా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

Related posts