telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో .. 24 గంటల కరెంటు ఇదేనా.. కేసీఆర్ సారూ !!

TRS Release Lok Sabha Candidates List

12 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యను లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కోసం వచ్చే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడానికి, వరంగల్‌ నగరంలోని 18వ డివిజన్‌ పెరుకవాడలోని పౌరుడు వినూత్న ప్రయత్నం చేశాడు. సమస్యను క్లుప్తంగా ఓ బోర్డుపై రాసి వీధిలోని స్తంభానికి కట్టారు. శివనగర్‌ పరిధిలోని రైల్వేగేటు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

వీధిలో స్తంభాలు పాతినా విద్యుత్తు తీగలు, దీపాలు లేవని, రాత్రి పూట చిమ్మ చీకటిలో ఇబ్బందులెదుర్కొంటున్నామని, దొంగల భయం కూడా ఉందని బోర్డుపై రాశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ దీన్ని ఎవరు తీయవద్దని, పని పూర్తయితే తానే తీస్తానని చివరగా మరో విన్నపం కూడా చేశారు. ఈ ప్లకార్డుపై ఒక మీడియా సంస్థ ప్రతినిధి స్థానికంగా ఆరా తీయగా 20 రోజులుగా ఇది ఉందని, ఎవరు కట్టారో తెలియదన్నారు. ఇలాగైనా సమస్య పరిష్కారమైతే మాకు సంతోషమేనన్నారు.

public compliant on street lightsకేసీఆర్ సారెమో తెలంగాణాలో 24 గంటలు కరెంటు ఇస్తున్నం అంటడు, ఈల్లేమో ఇట్ట అంటుండ్రు, ఎవరిని నమ్మాలో ఏందో.. కాస్త నువ్వన్నా చెప్పు కేటీఆర్ సారూ!

Related posts