telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సైబర్‌ చీటర్ల వలకు మరో బాధితుడు.. ఉద్యోగం పేరుతో రూ. 70 వేలు కుచ్చిటోపీ

హైదరాబాద్ నగరంలో సైబర్‌ చీటర్ల వలకు చిక్క ఎందరో నిరుద్యోగులు మోసపోతున్నారు. తాజాగా ఉద్యోగంపేరుతో ఫోన్ చేసి రూ. 70 వేల వరకు లాగేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న మురళికి మే నెలలో టైమ్స్‌2జాబ్స్‌ పోర్టల్‌ నుంచి అని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగాలున్నాయని రూ. 3,450 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించడంతో మురళి ఆ డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లించాడు.

తరువాత ప్రాసెసింగ్‌ ఫీ అని, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ అంటూ సుమారు రూ. 70 వేల వ రకు లాగేశారు. ఆ తరువాత మోసపోతున్నానని గుర్తించిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి సైబర్‌ చీటర్లు నిరంతరం వల వేస్తూ నిండా ముంచేస్తున్నారు. మాటలు చెప్పి.. మభ్యపెడుతూ రిజిస్ట్రేషన్‌ ఫీజుతో ప్రారంభిస్తూ కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆయా కంపెనీలకు కావాల్సిన ఉద్యోగాలకు దరఖాస్తులు ఈమెయిల్స్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకు చాలా పేరున్న కంపెనీలు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్నాయి. కొన్ని కన్సల్టెన్సీలు నిరుద్యోగులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.

Related posts