telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్విట్టర్ ట్రెండింగ్ లో పవర్ స్టార్ రికార్డు

Pawan

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో 20 రోజులు ముందుగానే…. అంటే జూలై 13 నుంచి ముందస్తు బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టేశారు ఆయన అభిమానులు. #PSPKAdvBdayTrendOnJuly13th హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దేశంలోనే ట్విట్ట‌ర్ ట్రెండింగ్ స్టార్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్స్ ట్వీట్స్ వ‌చ్చాయంటే అభిమానుల ఏ రేంజ్‌లో చేల‌రేగిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు వ‌రుస సినిమాల్లో నటిస్తున్నారు. ‘వకీల్‌సాబ్‌’తో పవన్ రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది అయ‌న అభిమానుల‌కు సంతోష‌క‌ర‌మైన వార్త అనే చెప్పాలి.

Related posts