సఖీ! నా ప్రేమ రేఖీ!!
కోమల కరములను
ముద్దాడి ముద్దాడి
గుండెల్లో ప్రేమనంతా వలపుల
మేఘమై నే కుమ్మరిస్తా!
నీ మునివేళ్ళ స్పర్శతో
తన్మయత్వంనొంది
గాలిలో ప్రేమ దూదిపింజమై తేలిపోతా!!
ప్రేమ పావురమై నీ పూల ఒడిలో
ప్రణయ పచ్చిక బయల్లో
ప్రేమ గీతాలు పాడుకుంటా!
నీ వెచ్చనిమెత్తని వలపుల
కౌగిలిలో స్వర్గసుఖమే
నేపొందుకుంటా!!
నిండు పండువెన్నెల కురిపించు
జాబిలమ్మ చల్లని సన్నిధిలో
పంచభూతాల సాక్షిగా
పాణిగ్రహంతో నీవాణ్ణినేనైతా!!
నారాణిని నిను చేసుకుంటా!!
బ్రతుకంత ప్రేమ పండుగ జరుపుకుంటా!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు