telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బక్రీద్ సందర్భంగా ఓమన్ రాజు సంచలన ప్రకటన… 200 మంది విడుదల

women online begging arrested

బక్రీద్ సందర్భంగా ఒమన్‌ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలు విడుదల కాబోతున్నారు. ఒమన్ రాజు కబూస్ బిన్ సుల్తాన్ ఆదేశాల మేరకు 200 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు రాయల్ ఒమన్ పోలీస్(ఆర్ఓపీ) అధికారులు వెల్లడించారు. వీరిలో సగానికి పైగా ప్రవాసీయులు ఉన్నట్లు ఆర్ఓపీ పేర్కొంది. ‘ఈద్ అల్ అధా’తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ నేరాలు చేసి అక్కడి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని కబూస్ బిన్ సుల్తాన్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు. ఇక తాము విడుదల చేయబోతున్న 202 ఖైదీల్లో సుమారు 89 మంది ప్రవాసీయులు ఉన్నారని తెలిపారు. మెజెస్టి చేసిన క్షమాపణ ఈద్ అల్ అధా 1440హెచ్‌ కిందకి వస్తుందని, దీని ప్రకారం దోషుల కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆర్ఓపీ అధికారులు పేర్కొన్నారు.

Related posts