telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ బేబీ” ప్రీమియర్ షో టాక్

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను ఓవర్సీస్ లో కూడా భారీగానే విడుదల చేశారు. ఇక యూఎస్ ప్రీమియర్ షో టాక్ పై ఓ లుక్కేద్దాం. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ద్వారా లక్ష్మి అనే వృద్ధురాలు యువతిగా మారిపోతుంది. ఈ క్రమంలో ఫ్రెండ్, కొడుకు అలాగే మనవడితో జరిగే ప్రయాణాలు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక సమంత వెంటపడే నాగ శౌర్య పాత్ర కూడా సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్. ఫ్లాష్ బ్యాక్ లో కూడా సమంత పాత్ర సరికొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో సమంత సీన్ కి తగ్గట్టు సరికొత్త అవతారం ఎత్తిందనే చెప్పవచ్చు. దర్శకురాలు నందిని రెడ్డి ఈ సెన్సిటీవ్ స్టోరీని చాలా బాగా డీల్ చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక కామెడీ సీన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. సెట్స్ కూడా సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ను కలిగిస్తాయి.

Related posts