telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ చరిత్రలోనే అత్యధిక శాతం ఓటింగ్‌…

గత కొన్నిరోజుల నుంచి సర్వత్రా ఆసక్తి కలిగించిన ‘మా’ ఎన్నిక‌లు మూడు గంట‌ల‌కు ప్రశాంతంగా పూర్తయింది. పాతికేళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌రిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్‌ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు..

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. 665 ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అందులో 605 మంది పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటే.. 60 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు.. మొత్తంగా రికార్డు స్థాయిలో 62 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది..

MAA Elections 2021: High drama during polling - English

గత ఎన్నికల్లో కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా.. ఈసారి రెండు ప్యానెళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఓటింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగింది.ఓటింగ్ శాతం పెరగడం వల్ల మా సభ్యుల్లో ఆనందం కనిపించింది.

అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్.. ఎవరికీ వారే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. 8 గంటల తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక, ఒక్కో పానెల్ నుండి‌ ఇద్దరు మాత్రమే పోలింగ్ బూత్ లోకి రావాలని ఎన్నికల అధికారులు రెండు ప్యానెళ్లకు సూచించారు.

Related posts