telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియా వారియర్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్

Priya-Varrier-and-Noorin-Shareef

“ఒరు అదార్ లవ్ ” సినిమా టీజర్ లో వెరైటీగా కన్ను గీటిన ప్రియా ప్రకాశ్ ఆ ఒక్క టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ వింక్ బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఆమె నటించిన “ఒరు అదార్ లవ్” చిత్రాన్ని “లవర్స్ డే”గా తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రియాతో పాటు రోషన్ అబ్దుల్, నూరిన్ షరీఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా విడుదల తరువాత ప్రియాకంటే నూరిన్ నటనకే మంచి మార్కులు పడ్డాయి.

సినిమాలో మరో హీరోయిన్ అయిన నూరిన్ ప్రియా వారియర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ రోల్ లో నూరిన్ ను తీసుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరిగేలా స్క్రిప్ట్ రాసుకున్నారట. కానీ టీజర్ తో ప్రియా ప్రకాష్ కు భారీ క్రేజ్ పెరగడంతో కథ మొత్తాన్ని మార్చేశారట. ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ పాత్రను తగ్గించేశారని వాపోయింది. ఈ కారణంగా తాను చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది నూరిన్. ఇకపై భవిష్యత్ లో ఎప్పుడైనా ప్రియాతో నటించే అవకాశం వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, ఆమె వల్ల తన కెరీర్ అంతా గందరగోళమై పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది నూరిన్.

Related posts