telugu navyamedia
సినిమా వార్తలు

మరో స్టార్ హీరోయిన్ కు లైంగిక వేధింపులు… తల్లినీ వదల్లేదుగా…

kani kusruthi

మీటూ ఉద్యమం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అయితే మీటూ వల్ల కొంతవరకు మంచే జరిగినా మరికొంతమందికి మాత్రం ఇబ్బందులు తప్పలేదు. అంతేకాదు కొంతమంది సెలెబ్రిటీలు ఈ ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం దుర్వినియోగ పరుస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా మరో నటి ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ద్వారా బయటపెట్టింది. “కాక్ టెయిల్, షికార్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మలయాళ నటి కణి కుసృతి. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది ఈ మలయాళ భామ. మంచి నటిగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతున్న సమయంలోనే అకస్మాత్తుగా నటనకు దూరమైంది ఈ అమ్మడు.

ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన కణి ఓ చిత్ర నిర్మాత తనను శారీరకంగా సుఖ పెడితేనే సినిమాలో ఆఫర్ ఇస్తానని అన్నాడట. అంతేకాదు ఈ విషయంలో తన తల్లిని కూడా ఒత్తిడికి గురి చేశారట. దానికి అంగీకరించకపోవడంతో అవకాశాలు రాలేదని, అందుకే తాను కూడా సినిమాల నుంచి తప్పుకున్నానని షాకింగ్ విషయాలను వెల్లడించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమమా ఊపందుకోవడం వల్ల కొందరికైనా మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Related posts