telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రిపబ్లికన్లపై .. కొండంత ఆశతో.. ట్రంప్..

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ జోరందుకుంటోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, హౌస్ కాంగ్రెస్ కార్యకలాపాలకు అడ్డు తగిలారనే ఆరోపణలను హౌస్ జుడీషియరీ కమిటీ ఆమోదించింది. అభిశంసనకు సంబంధించిన రెండు అధికరణలను ప్రతినిధుల సభ వచ్ఛే వారం ఆమోదించే సూచనలున్నాయి. ఈ కమిటీలోని 23 మంది డెమొక్రాట్లు అభిశంసనకు అనుకూలంగా, 17 మంది రిపబ్లికన్లు ప్రతికూలంగా ఓటు వేశారు. డెమొక్రాట్లు అధికంగా ఉన్న హౌస్ త్వరలో ఈ అభియోగాలను ఆమోదించవచ్చు.

జనవరిలో జరిగే విచారణలో రిపబ్లికన్లు అధిక సంఖ్యలో ఉన్న సెనేట్ ఆయనను నిర్దోషిగా కూడా తేల్చవచ్ఛునని అంటున్నారు. వచ్ఛే ఏడాది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న జో బిడెన్ అవినీతిపై విచారణ జరపాలంటూ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరిన నేపథ్యంలో.. మొదటి అధికరణంలో నిందితునిగా చేర్చారు. మరోవైపు తన చర్యలపై కాంగ్రెస్ హౌస్ విచారణ జరపకుండా అడ్డుపడేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గాను ఆయనను రెండో అధికరణంలో నిందితునిగా పేర్కొన్నారు. అయితే తన అభిశంసన ప్రక్రియ అంతా బూటకమని ట్రంప్ కొట్టిపారేశారు. రిపబ్లికన్లు ఎలాగూ తనను ఈ గండం నుంచి బయటపడేస్తారన్న కొండంత నమ్మకంతో ఉన్నారు.

Related posts