telugu navyamedia
రాజకీయ వార్తలు

గడ్కరీ ఆ అంశంలో సహకరించాలి: సుప్రీంకోర్టు

ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ పాలసీకి సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా వినూత్నమైన ఆలోచనలను తమతో పంచుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సుప్రీంకోర్టు కోరింది. తమను వచ్చి కలవాలని కోర్టు సూచించింది. ఇవి తాము పంపుతున్న సమన్లు కాదని, కేవలం విన్నపం మాత్రమేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి ఉందని జస్టిస్ బాబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, నితిన్ గడ్కరీకి సమన్లు జారీ చేస్తున్నట్టుగా తాము భావించడం లేదని… ఇది కేవలం ఒక విన్నపం మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి ఈ అంశంపై స్పందిస్తే బాగుంటుందని, నితిన్ గడ్కరీ వస్తారేమో కనుక్కోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి సూచించారు.

Related posts