telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నితిన్ ‘చెక్’ ఫిబ్రవరిలో విడుదల కావడానికి అదే కారణమా..?

టాలీవుడ్ లో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న హీరోల్లో నితిన్ ఒకడు. అయితే ప్రస్తుతం నితిన్ సినిమాలో ఒకటైన చెక్ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపంచనున్నాడు. ఈ మేరకు ఇప్పటికి విడుదలైన టీజర్, ప్రచార చిత్రాల ద్వారా అర్థం అవుతోంది. అయితే ఇటీవల నితిన్ చెక్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అయితే గతేడాది భీష్మ సినిమా నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా గతేడాది ఫిబ్రవరీ21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సారి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేయాలని నితిన్ చూస్తున్నాడు. అందుకేనేమో ఇప్పుడు చెక్ సినిమాను కూడా ఫిబ్రవరీ19న థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందోమే లేదో చూడాలి. ఇక ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు హీరోయిన్‌లుగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా అభిమానులు ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts