telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

2వ దశలో 30 కోట్ల మంది కి టీకా : కిషన్ రెడ్డి

kishanreddy on ap capital

ఈ జనవరి 16 నుండి కరోనా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి దశ ఎప్పటి వరకు అనేది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని… 2వ దశలో 30 కోట్ల మంది కి టీకా ఇస్తామని అన్నారు. ఇంకా కరోన ఖతం కాలేదన్న ఆయన  చాలా దేశాల్లో కరోన ప్రబలింది.. కొన్ని దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ పెడుతున్నారని అన్నారు. వాక్సినేషన్ పై రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్న ఆయన మన దేశ కంపెనీల మీద నమ్మకం లేదన్న వాళ్ళను ఆ భగవంతుడే రక్షించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ కి అడగక ముందే నిధులు కేటాయించిందన్న ఆయన జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ పరిశోధన సెంటర్ ఏర్పాటు కోసం మూడెకరాల స్థలం ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని అన్నారు. బిబి నగర్ ఎయిమ్స్ బిల్డింగ్ ని కూడా ఇంకా హాండ్ ఓవర్ చేయలేదని అన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 కోట్ల లో ఇంకా 20 కోట్లు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఆదిలాబాద్ లో కూడా హాస్పిటల్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలన్న ఆయన రైల్వే లైన్ లకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది.. ఆ పని చేస్తే బాగుంటుందని అన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందన్న ఆయన రాజకీయాలు మాట్లాడే ముందు తెలంగాణ కు లాభం చేకూర్చే పనులు ఈ ప్రభుత్వం చేయాలని అన్నారు.

Related posts