telugu navyamedia
సినిమా వార్తలు

మోక్షజ్ఞతో నిహారిక ఫోటో… మెగా డాటర్ కామెంట్స్

మెగా కాంపౌండ్ నుంచి చాలామందే హీరోలు ఉన్నా.. హీరోయిన్ మాత్రం నిహారిక ఒక్కరే… తాజాగా తాను నటించిన “సూర్యకాంతం” సినిమా విడుదలకు సిద్ధమవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది నిహారిక. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో నిహారిక ఉన్న ఫోటోపై స్పందించింది. “అప్పట్లో అంటే నేను డిగ్రీ చదివేటప్పుడు కాలేజీలో మోక్షజ్ఞ నా జూనియర్. అప్పుడు అతను పరిచయం. మీరూ చూస్తున్న ఆ ఫొటోలు అప్పుడు దిగినవే. ఇప్పటివి కాదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. ఇక మా నాన్న కామెంట్స్ ఆయన పర్శనల్. పెళ్లి అయ్యే వరకు నా జీవితం నా ఇష్టం. సినిమాలకు కూడా నేను ఒక్కదాన్నే వెళ్తా. పాప్‌కార్న్ షేర్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు’’ అని తెలిపింది.

గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని బాలకృష్ణ అనగా… గత కొన్ని రోజుల క్రితం నాగబాబు తనకు బాలయ్య ఎవరో తెలియదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో హర్ట్ అయిన బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞతో నిహారిక ఉన్న ఫోటోను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తరువాత నాగబాబు తన కౌంటర్లు ఆపేసిన విషయం తెలిసిందే. మరోవైపు మోక్షజ్ఞ, నిహారిక చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి తెరపై మోక్షజ్ఞ, నిహారిక జంటగా కన్పిస్తారేమో చూడాలి

Related posts