telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కేరళలో మళ్ళీ .. నిఫా వైరస్ .. !

nifa virus in kerala again need to confirmed

నిఫా వైరస్ మరోసారి కేరళలో కలకలం రేపింది. గత ఏడాది నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కోజికోడ్ లో వైరస్ సోకిన పేషెంట్ కు ట్రీట్మెంట్ చేసిన నర్సు కూడా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ జాడలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎర్నాకులంలో 23 ఏండ్ల యువకుడు నిఫా వైరస్ అనుమానిత లక్షణాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ ఎమ్ కే కుట్టప్పన్ తెలిపారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అతడి బ్లెడ్ శాంపిల్స్ ను టెస్ట్ ల కోసం మణిపాల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ కు, కేరళ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్‌ కు పంపించినట్లు తెలిపారు. టెస్ట్ ల రిపోర్ట్ లు సోమవారం వస్తాయన్నారు. ఆ యువకుడు శిక్షణలో భాగంగా పది రోజుల కిందట పక్క జిల్లాకు వెళ్లాడని, తీవ్ర జ్వరం రావడంతో కిందపడిపోయాడని తెలిపారు

ఆ యువకుడికి నిఫా సోకినట్టు కన్ఫర్మ్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇప్పటివరకు వ్యాధి నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. గతంలో అనేకమంది నిఫా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్ లో చేరారని, పరీక్షల అనంతరం వైరస్ జాడ కనిపించలేదన్నారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ప్రజలకు తెలియజేస్తామని, ఇతరులకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఎర్నాకులం కలెక్టర్ మహ్మద్ సైఫుల్లా తెలిపారు.నిరాధార వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఇండియన్ జర్‌నల్ ఆఫ్ వైరాలజీ ప్రకారం గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉన్నది.

Related posts