telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్ లతో సినిమా అంటే నిద్ర పట్టదు… నిధి అగర్వాల్

nidhi agarwal counter answer to

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్ కావడానికి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ ల గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాతో హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్‌. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరంగా విషయాలను పంచుకుంది. తను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్నని, అబ్బాయిలను, అమ్మాయిలను బాగా కొట్టేదాన్నని తెలిపింది. తన గురించి కామెంట్ చేశాడని.. ఓ అబ్బాయిని యాపిల్‌తో కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకుంది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని తొలిసారి ఇష్టపడ్డానని, ఇప్పుడు ఆ అబ్బాయి తనకు మంచి స్నేహితుడయ్యాడని చెప్పుకొచ్చింది. కామెడీ సినిమాలను బాగా చూస్తానని, మిమిక్రీ చేస్తుంటానని తెలిపింది. సినిమాల్లోకి రావాలని ఉండేదని, తెలిసిన ఫొటోగ్రాఫర్ ద్వారా మోడలింగ్‌లోకి అడుగుపెట్టానని తెలిపింది. ఆ తర్వాత సినీ అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. టైగర్ ష్రాఫ్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని, త్వరగా నిద్ర లేవడం, జిమ్‌కు వెళ్లడం అలవాటైందని చెప్పింది. ఎన్టీఆర్‌, రణ్‌బీర్, అల్లుఅర్జున్ లాంటి వారితో షూటింగ్ ఉందంటే ఆ రాత్రి నిద్రపట్టదని టెన్షన్‌గా ఉంటుందని తెలిపింది. తాను పుట్టింది హైదరాబాద్‌లోనేనని.. తన తల్లి ఇక్కడి వారేనని చెప్పింది. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని.. టాలీవుడ్‌లో అందరూ సపోర్ట్ చేస్తుంటారని ప్రశంసించింది. తెలుగు భాష కష్టమని.. దానికంటే యాక్టింగ్ చేయడం ఈజీ అని చెప్పింది. టైగర్ ష్రాఫ్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపింది. త్వరగా నిద్ర లేవడం, జిమ్‌కు వెళ్లడం అలవాటైందని చెప్పింది. ఎన్టీఆర్‌, రణ్‌బీర్, అల్లుఅర్జున్ లాంటి వారితో షూటింగ్ ఉందంటే ఆ రాత్రి నిద్రపట్టదని టెన్షన్‌గా ఉంటుందని తెలిపింది. తాను పుట్టింది హైదరాబాద్‌లోనేనని.. తన తల్లి ఇక్కడి వారేనని చెప్పింది. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, టాలీవుడ్‌లో అందరూ సపోర్ట్ చేస్తుంటారని ప్రశంసించింది. తెలుగు భాష కష్టమని, దానికంటే యాక్టింగ్ చేయడం ఈజీ అని చెప్పింది. అంటూ చెప్పుకొచ్చింది.

Related posts