telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో కన్నుమూసిన మరో నటుడు

Nick

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తోన్న వైరస్ కరోనా కారణంగా తాజాగా హాలీవుడ్ న‌టుడు నిక్ కార్డెరో కన్నుమూశారు. వైర‌స్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన త‌ర్వాత ఆదివారం ఆయ‌న ప్రాణాలు విడిచారు. 41 యేళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌ అత‌ని కుడికాలిలో ర‌క్తం గ‌డ్డం క‌ట్ట‌డంతో వైద్యులు ఆయ‌న‌ కాలును సైతం తొలగించారు. తాజాగా అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత‌ విష‌మించ‌డంతో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు.

Related posts