telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శర్వానంద్ సినిమా నుండి సంక్రాంతి పాట విడుదల…

ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు హీరో శర్వానంద్. అతడు చేసే సినిమాలు ప్లాప్ అయినా హిట్ అయినా వరుస సినిమాలు చేస్తూ అరుదైన తరహా హీరో అనిపించుకున్నాడు. అయితే ప్రస్తుతం శర్వా వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు. అతడు తాజాగా నటిస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమా నుంచి ఇటీవల ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ సారి సంక్రాంతి దగ్గర పడుతుండగా సంక్రాంతి పాటను విడుదల చేశారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట బలేగుంది బాలా సంగీత ప్రియులను బాగా ఆకర్షించింది. ఇటీవల విడుదలైన పాట సంక్రాంతి సంబరాలను, సందడులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే అని సాగే ఈ పాట తన సాహిత్యంతో ఎందరో గుండెల్ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని 14ప్లస్ రీల్స్ బ్యానర్‌పై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts