telugu navyamedia
సినిమా వార్తలు

మంచు లక్ష్మిపై ట్రోలింగ్… “ఇంగ్లీష్ పుత్రీ” అంటూ శ్రీరెడ్డి సెటైర్

manchu lakshmi

సాధారణంగా సినిమా ఆడియో వేడుకలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు ముఖ్య అతిథులుగా సెలెబ్రిటీలను పిలుస్తుంటారు. వారు స్పీచ్ లు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. అయితే సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని వాడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ స్ట్రాటజీలు విమర్శల పాలవుతాయి. తాజాగా నటి మంచు లక్ష్మికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన “ఓ బేబీ” సినిమా జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేష్, రానా లతో పాటు మంచు లక్ష్మీ కూడా అతిథిగా హాజరైంది. ఈవెంట్ లో భాగంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ “ఓ బేబీ” సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను పొగుడుతూ “మీరు నటించిన జంబలకిడి పంబ సినిమా వెయ్యిసార్లు చూసి ఉంటాం.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం” అంటూ నోరు జారింది. నిజానికి “జంబలకిడి పంబ” సినిమాలో హీరో నరేష్.. కానీ మంచు లక్ష్మీ.. రాజేంద్రప్రసాద్ అని స్టేజ్ మీద చెప్పడంతో ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. నటి శ్రీరెడ్డి కూడా మంచు లక్ష్మీకి పంచ్ వేసింది. “ఇంగ్లీష్ పుత్రీ… మంచులక్ష్మి జీ.. జంబలకిడిపంబ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా… పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా”అంటూ పోస్ట్ చేసింది.

Related posts