telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు బ్రదర్ పై ట్రోలింగ్… భార్యను మోసం చేశాడని…

Allu-Babi

అల్లు అరవింద్ పెద్ద కుమార్ అల్లు బాబీ ఇటీవల ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా రెండో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బాబీకి గతంలో నీలిమ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి అన్విత అనే కూతురు కూడా ఉంది. ఇక అల్లు బాబీ తనకు పెళ్లైన విషయాన్ని తెలుపుతూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేస్తావా..? నీ కూతురు పరిస్థితేంటి..? ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ ట్వీట్లు చూసిన అల్లు బాబీ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పరస్పర అంగీకారంతో 2016లో విడాకులు తీసుకున్నామని, కానీ పాప కోసం ఇద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటామని చెప్పారు. తన కూతురు అన్విత అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నానని, ఇప్పటికీ తన మొదటి భార్యతో టచ్ లోనే ఉంటానని.. అల్లు కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు ఆమె హాజరవుతుంటారని, అల్లు ఫ్యామిలీలో నీలిమ కూడా ఒక మెంబర్ అని స్పష్టం చేశారు.

Related posts