telugu navyamedia
culture Telugu Poetry

ప్రియా నీ జతలో

mana prema poetry corner

మృత్యువు వచ్చి నను చుట్టేసినా…..
భయం లేదు రా నాకు నీ జత లో……
నీ యెడ బాటు కన్నా భాదేముంది రా…..
నీ రాక కన్నా సంతోషం ఏమున్నది రా….
రేపన్నది నాకు ఉన్నదో లేదో కాని…..
ఈ క్షణం నువ్వు నాతో ఉండనీ….
వెన్నంటే నీడలా మృత్యువు కబళించే వేళ….
నీ జ్ఞాపకాల లో తల దాచుకుంటా…..
భయం లేదు రా నాకు నీ జత లో…….
నీవు లేని నాడు నా జీవితం….
వెలుగు ఇవ్వలేని దీపమై…..
నీవు రాని నాడు ఈ దేహము…..
రెక్కలు నేల రాలిన పూవై….
మృత్యు ఒడిలో నిద్రపోవునేమో….
భయం లేదు రా నాకు నీ జత లో…..
ప్రాణం పోతున్న నా కళ్ళలో నీవే…..
నాలో శ్వాస సాగిపోతున్న హృదయాన నీవే …
మరచిపోలేని ధ్యానం లో….
హృదయ వీణ స్వరం లో నిత్యం నీవై….
నా జత లో నీవు ఉండగా ….
భయం లేదు రా నాకు నీ జత లో ……
కను మూసే లోగా ఒక్క సారైనా…..
తనివతీర నిను చూసుకోనీ ప్రియా…..
నీతో గడిచే ప్రతి క్షణం నాలో….
ఆగిపోయే శ్వాశకు పునరుజ్జీవనం …..
ఎదురు చూపుల పల్లకి లో…..
వేచి చూస్తున్నది మృత్యువు…..
అయినా నువ్వు నా జత లో ఉంటే…..
భయం లేదు రా నాకు నీ రూపమే
నీ రాక యే ఆనందం నాకు !
జె.పద్మావతి
ఆదోని

Related posts

అమెరికా మిలటరీ డ్రిల్ లో “జనగణమన”

vimala p

పాఠశాల అపహాస్యమైతే విద్య నిరర్థకము!

vimala p

హరీశ్ రావు పీఏకు కరోనా సోకినట్టు వార్తలు!

vimala p