telugu navyamedia
సినిమా వార్తలు

రాధారావికి నయనతార కౌంటర్… లేఖ విడుదల

Nayanatara-and-Radharavi

ప్రముఖ తమిళ సీనియర్ నటుడు రాధారవి తనపై చేసిన అనుచితమైన, అసభ్యకర వ్యాఖ్యలపై నయనతార స్పందించింది. రాధారవిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక లేఖను విడుదల చేసింది. వృత్తిపరంగా దేవుడు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడని, తమిళ ప్రజలు కూడా తన పనిని గుర్తించితనకు మద్దతు ఇస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని చప్పట్లు కొట్టి, అభినందిస్తుండడం షాకింగ్ గా ఉందని, ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నంత కాలం ఇలాంటి వారు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని ఈ లేఖలో పేర్కొంది నయనతార.

”ముందుగా నేను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన వెంటనే స్పందించి రాధారవి లాంటి వ్యక్తిని పార్టీలో నుంచి తొలగించారు” అని తెలిపి రాధారావికి కౌంటర్ గా ”మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. మహిళలను తక్కువ చేసి మాట్లాడడం మగతనం అనుకుంటారు. ఇలాంటి మగవారి మధ్య బతుకుతున్న ఆడవాళ్లను చూస్తుంటే నాకు జాలేస్తుంది. చేతిలో సినిమాలు లేక ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు’ అంటూ మండిపడింది.

Related posts