telugu navyamedia
telugu cinema news

చిరంజీవి గోటికి బాలకృష్ణ సరిపోడు : నాగబాబు

NagaBabu Shocking Comments on Balakrishna

గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు వరుస వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు కామెంట్-6 అంటూ వీడియోను విడుదల చేసిన వీడియోలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చివరిగా ఈ వీడియోతో ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు.

గతంలో నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో “చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ “చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు” అని చెబితే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో, పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? ఎంత అహంకారం మీకు? మాకు కోపాలు రావా? సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి.

మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని ఎవరైనా అంటే మాత్రం 100 శాతం రియాక్ట్ అవుతాం. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్ ను ఆపేస్తారని ఆశిస్తున్నాం… పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోండి…

రాజకీయ విమర్శలు చేయండి. అలాంటి వాటిపై నేను రియాక్ట్ కాను. చిరంజీవి అంటే కేవలం మాకు అన్నయ్య మాత్రమే కాదు తండ్రితో సమానం. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ముగ్గురం కలిసే ఉంటాము.

థ్యాంక్యూ బాలయ్య గారూ… ఇకపై మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం. మెగా ఫ్యాన్స్ కు ఒకటే విన్నపం… మనం చెప్పాల్సింది చెప్పాం. ఇకపై దీన్ని ఇష్యూ చేయకండి. మహేశ్ బాబు ఫ్యాన్స్ కావొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావొచ్చు. మెగా ఫ్యాన్స్ కావొచ్చు. మనమంతా మనుషులమే. ఆ తర్వాతే అభిమానులం… అందరం కలిసుందాం… అందరి సినిమాలను ఆదరిద్దాం” అంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు నాగబాబు. మరి ఈ విషయంపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts

పవన్ కు .. రాంగోపాల్ వర్మ కౌంటర్… గెలకొద్దు అంటున్న అభిమానులు..

vimala p

“మహర్షి” సెలెబ్రేషన్స్… స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

vimala p

బాలీవుడ్ స్టార్ పై సిద్దార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు

vimala p