telugu navyamedia
సినిమా వార్తలు

మహిళతో అక్రమ సంబంధం… రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరో

Emraan

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి వెండి తెరపై మంచి కిస్సర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. 2004లో తను చేసిన మర్డర్ సినిమాలాంటి వ్యవహారమే తన జీవితంలోకీ వస్తుందని ఊహించలేదని, తన పెళ్లికు ముందు అనుకోకుండా ఓ పెళ్లైన మహిళతో అక్రమ సంభందం నెరిపానని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు ఇమ్రాన్. ఈ సందర్భంగా ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ… అయితే ఆమెతో సంబంధం పెట్టుకునేటప్పుడు ఆమెకు పెళ్లైందనే విషయం తెలియలేదని, ఆమె కూడా చెప్పలేదని తెలిపారు. ఓ రోజు అనుకోకుండా విషయం బయటపడిందని, అప్పుడు ఆమెను వదిలేద్దామనుకున్నాను నిర్ణయించుకున్నా… కొన్ని బలహీన పరిస్దితుల్లో ఆ బంధాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చాడు. ఓ రోజు ఆమె భర్త మా ఎఫైర్ రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. పెద్ద గొడవైంది. అప్పుడు మాకు, ఆమెకు సంబంధించిన కొందరు మధ్యవర్తులు కలగ చేసుకుని చక్క దిద్దారు. నేను నా తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నాను. అయితే జీవితంలో ఓ పాఠం నేర్చుకున్నా. ఎప్పుడు సాహసంగా ఉందని ఇలాంటి చెత్త పనులు చేయకూడదని అని చెప్పుకొచ్చాడు. అదే నా ఫ్యామిలీలో జరిగితే ఖచ్చితంగా నా భార్యతో అలా ఎవరైనా ఎఫైర్ పెట్టుకుంటే నేను ఆ వ్యక్తిని చంపేసేవాడిని అన్నారు. ఇక ఆ రిలేషన్ ఇప్పుడయితే లేదు.

Related posts